నిత్యా మీనన్.. ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేనిది. నటనా సామర్ధ్యం ఎంతుందో అంతకు మించిన పొగరు కూడా నిత్యా మీనన్ సొంతం. ఆమెతో సినిమా చేయడమంటే కొరివితో తల గోక్కున్నట్టే అన్నది వారి అభిప్రాయం.
కథ చెప్పినప్పటి నుంచి షూటింగ్ పూర్తయ్యేవరకూ ఆమెతో తిప్పలు పడలేక మాలీవుడ్ నుంచి ఆమెను బహిష్కరించే ఆలోచనలో ఉన్నారట! ఎప్పుడూ ఏదో ఒక సమస్య నెత్తిమీద వేసుకుని బాధపడుతూనో, లేకపోతే ఆలోచిస్తూనో ఉంటుందనీ, షూటింగ్లో సరిగా పాల్గొనదనీ ఒకవేళ సవ్యంగా షూటింగ్కొచ్చినా, దర్శకత్వంతో పాటు.. ఇతర శాఖల్లో వేలుపెట్టి గెలుకుతుందని వారు ఆరోపిస్తున్నారు.
అయితే, ఈ నిర్మాతల ఆరోపణలను నిత్యామీనన్ కొట్టిపారేస్తోంది. తనకు వృత్తే దైవమంటోంది. దాని తర్వాతే మిగతా విషయాలని వాదిస్తోంది. తనకు ఎన్ని సమస్యలున్నా వాటిని షూటింగ్ స్పాట్‌కి తీసుకురాననీ, అవన్నీ షూటింగ్ బయటే పరిష్కరించుకుంటానని స్పష్టం చేస్తోంది. అయితే, ఆమె ఎన్ని వివరణలు ఇచ్చినప్పటికీ మాలీవుడ్ దర్శక నిర్మాతలు మాత్రం భయపడిపోతున్నారు.