విజయం మాదే.. ప్రధాని రేసులో లేను : రాజ్‌నాథ్

0
82

ఈ నెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఫలితాల్లో బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్న నమ్మకాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యక్తం చేశారు.

ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోడీపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన స్థానాల కన్నా ఎక్కువ స్థానాలే బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.

బీజేపీకి మూడింట రెండొంతుల మెజార్టీ వచ్చే అవకాశముందన్నారు. ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం మమతా బెనర్జీ వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఇకపోతే, బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రానిపక్షంలో తాను ప్రధానమంత్రి రేసులో ఉన్నట్టు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. అలాంటి పరిస్థితే ఉత్పన్నంకాదన్నారు. పైగా, తాను ప్రధాని రేసులో లేనని తేల్చిచెప్పారు.