వాట్సాప్‌కు వైరస్.. అప్డేట్ చేసుకోకపోతే…

0
64

సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన వాట్సాప్‌కు వైరస్ సోకింది. అయితే ఇపుడు ప్రతి ఒక్కరి మొబైళ్లలో ఉండే ఈ యాప్ వైరస్ బారిన పడింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ వెల్లడించింది. కొందరికి మొబైళ్లలోకి వాట్సాప్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ ద్వారా స్పైవేర్ ప్రవేశించిందని వెల్లడించింది.

ఈ స్పైవేర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఒ గ్రూప్ అనే అడ్వాన్స్‌డ్ సైబర్ యాక్టర్ రూపొందించిందని తెలిసింది. వాట్సాప్ భద్రతా వ్యవస్థలో తలెత్తిన లోపం కారణంగా ఈ స్పైవేర్ వచ్చిందని, ఈ లోపాన్ని ప్రస్తుతం సరిచేసినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.

యూజర్లు తమ వాట్సాప్ యాప్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సంస్థ కోరింది. వాట్సాప్ వాయిస్ కాలింగ్ ద్వారా వచ్చే మిస్డ్ కాల్స్‌తో ఈ మాల్వేర్ ఫోన్లలోకి ప్రవేశించిందని, మే మొదటివారంలో ఈ మాల్‌వేర్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది.