కాంగ్రెస్ కండువా కప్పుకున్న సీఎం కుమారస్వామి.. సిద్ధూకు మంట

0
92

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేను వెనుకేసుకొచ్చారు. ఖర్గేకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందని విమర్శించారు. ఖర్గే చేసిన సేవలకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఖర్గే కర్ణాటకకు ఎప్పుడో ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. కుమారస్వామి కాంగ్రెస్ కండువా కప్పుకొని సంచలన వ్యాఖ్యలు చేయడంతో కర్నాటక కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా, సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేడీఎస్ నేతగా ఉన్న సీఎం కుమార స్వామి తమ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మద్దతులో జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మధ్య విభేదాలు వచ్చాయని రాజకీయ పరిశీలకులు మీడియాతో చర్చించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఈ వ్యాఖ్యలతో సిద్ధరామయ్య నాయకత్వంపై కుమారస్వామి పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారని రాజకీయ పరిశీలకలు వాపోతున్నారు. మే 23 తర్వాత కర్నాటకలో కాంగ్రెస్ మద్దతు కొనసాగుతున్న జేడీఎస్ ప్రభుత్వం పడిపోతుందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు జోస్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, లోక్ సభలో ప్రతిపక్షనేత ఖర్గే మధ్య చెలరేగిన విభేదాల వల్ల కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోయే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.