డ్రగ్స్ కేసులో ఎవరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదు…

0
66

తెలుగు చిత్ర పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం ఓ కుదుపు కుదిపింది. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో పలువురు సినీ తారలకు క్లీన్‌చిట్ ఇచ్చినట్టు వచ్చిన వార్తలను తెలంగాణ ఎక్సైజ్ శాఖ కొట్టిపారేసింది. మాదకద్రవ్యాల కేసులో సినీ తారలు సహా ఏ ఒక్కరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదని స్పష్టం చేసింది.

మాదక ద్రవ్యాల కేసులో ఇప్పటివరకు ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేశామని, ఇంకా ఐదు ఛార్జిషీట్లు దాఖలు చేయాల్సి ఉందన్నారు. సినీ ప్రముఖుల వ్యవహారంలో ఫోరెన్సిక్ ఆధారాలు వచ్చాయని వివరించారు. త్వరలో మిగతా ఛార్జిషీట్లు దాఖలు చేస్తామని వెల్లడించారు.

మాదక ద్రవ్యాల కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని అధికారులు హెచ్చరించారు. ఈ కేసులో 62 మందిని విచారించామని, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదన్నారు. ఇంకా పలు ఆధారాలు రావల్సి ఉందని వచ్చిన తర్వాత సరైన చర్యలు తీసుకుంటామన్నారు.