టాప్ హీరోల నుంచి పిలుపు రావాలేగానీ…

0
40

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందాల భామల్ల ఈషా రెబ్బా ఒకరు. అందాలు ఆరబోయడంలో ఏమాత్రం వెనుకంజవేయదు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన “అరవింద సమేత” చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించే అవకాశం కొట్టేసింది.

అదేసమయంలో ఈ అమ్మడుకు స్టార్ హీరోయిన్‌గా ఎదగడానికి కావలసిన అన్ని క్వాలిటీలు ఉన్నప్పటికీ.. అగ్ర హీరోలతో నటించే అవకాశమే రావడం లేదని వాపోతోంది. దీంతో పెద్ద హీరోలతో ఛాన్సుల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. అదేసమయంలో వరుసగా గ్లామర్ ఫోటో షూట్‌లు చేస్తూ… సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.

రీసెంట్‌గా జిగేల్ అనిపించే బ్లాక్ కలర్ డ్రెస్‌తో ఫోటో షూట్ చేసి ఆ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మొత్తంమ్మీద టాప్ హీరోల సరసన నటించే ఛాన్సు కోసం ఈషా రెబ్బా ఆశగా ఎదురు చూస్తోంది. మరి ఆమెపై ఏ హీరో మనసుపడతాడోగానీ ఆ హీరో అదృష్టంపండినట్టే.