బాలకృష్ణ కంట్లోపడిన కుర్ర హీరోయిన్…

0
143

తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్రహీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈయన కుర్ర హీరోలతో పోటీపడి చిత్రాలు చేస్తుంటారు. ముఖ్యంగా, డ్యాన్సులు, ఫైట్ సన్నివేశాల్లో ఎంతో రిస్క్ తీసుకుని చేస్తుంటారు. అలాగే, హీరోయిన్ల ఎంపికలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యంగా, ఈయనకు ముదురు హీరోయిన్లు అంటే అసలు పడదు. అందుకే తాను నటించే ప్రతి కొత్త చిత్రంలో ఓ కుర్ర హీరోయిన్ ఉండాల్సిందేనన్న షరతు పెట్టినట్టు ఇండస్ట్రీ టాక్.

ఈ పుకార్లను నిజం చేస్తూ ఆయన ఇపుడు ఓ కుర్ర హీరోయిన్‌పై మనసుపడ్డారు. ఆమె ఎవరో కాదు ఆర్ఎక్స్100 చిత్రంతో ఒక్కసారిగా హాట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిన పాయల్ రాజ్‌పుత్.

తమిళ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ – బాలయ్య కాంబినేషన్‌లో నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించే చిత్రంలో ఓ హీరోయిన్‌గా పాయల్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం.

ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. వాటిలో ఒకటి పోలీస్ పాత్రని తెలుస్తోంది. బాలయ్య గత చిత్రాలు ‘మహానాయకుడు’, ‘కథానాయకుడు’ రెండూ బాక్సాఫీస్ వద్ద పరాజయం చెండంతో ఈ చిత్రంపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

ఇకపోతే కె.ఎస్.రవికుమార్ గతంలో బాలకృష్ణతో ‘జైసింహ’అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. దీంతో తాజా ప్రాజెక్టుపై హీరో, దర్శకుడు ప్రత్యేక దృష్టిని సారించి, హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారట.