బీజేపీకి బ్రాంచ్ ఆఫీసుగా ఈసీ కార్యాలయం : స్టాలిన్

0
69

కేంద్ర ఎన్నికల సంఘంపై డీఎంకే అధినేత ఎంకేస్టాలిన్ మండిపడ్డారు. పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచార సమయాన్ని తగ్గిస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ప్రతిక్షాల విషయంలో ఒకలా, అధికార పార్టీ విషయంలో మరోలా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలకు ఒక రూల్? అధికార పార్టీకి మరో రూలా? అంటూ ఈసీని స్టాలిన్ ప్రశ్నించారు.

బీజేపీ కార్యకర్తలు తమిళనాడులోని పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లుగానే బెంగాల్‌లో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని, మరి ఇక్కడ ఎందుకు ప్రచార సమయాన్ని కుదించలేదని నిలదీశారు.

కాగా, కోల్‌కతాలో అమిత్ షా రోడ్ షోలో టీఎంసీ, బీజేపీల మధ్య చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో.. ఈసీ పశ్చిమ బెంగాల్‌లో గురువారం రాత్రి 10 గంటల వరకే ఎన్నికల ప్రచారం చేయాలని, ఆ తర్వాత చేయొద్దని ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.