వరుణ్ తేజ్‌కు హ్యాండిచ్చిన పూజా హెగ్డే

0
57

‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. ‘ముకుంద’లో గోపికగా అలరించిన హాట్‌బ్యూటీ పూజా హెగ్డే. టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి ఫాంలో ఉంది. ఇటీవల “అరవింద సమేత”తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా “మహర్షి” సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే, ‘మహర్షి’ సెట్స్ మీద ఉండగానే అల్లు అర్జున్‌, ప్రభాస్, వరుణ్‌ తేజ్‌ సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పారు. తాజా సమాచారం ప్రకారం వాల్మీకి నుంచి పూజా హెగ్డే తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. డేట్స్ అడ్జస్ట్‌ కాకపోవడంతో పూజ… వరుణ్‌ తేజ్‌ సినిమా నుంచి తప్పుకున్నట్టు సమాచారం.