ఇటీవలి కాలంలో హీరోయిన్ల వస్త్రాలంకరణపై పలు రకాల కామెంట్స్ వినివస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఇదంతా జరుగుతోంది. హీరోయిన్ల డ్రెస్సులు నచ్చకపోతే సింపుల్‌గా నెటిజన్లు తిరస్కరిస్తున్నారు. తమకు తోచిన శైలిలో కామెంట్స్‌తో విసిగిస్తున్నారు. అయితే అందాల భామలు ఏమాత్రం తగ్గడం లేదు. కొందరైతే వారి నెగిటివ్ కామెంట్స్‌ని సైతం తెగ ఎంజాయ్ చేస్తుంటే… ఇంకొందరు అప్పటికప్పుడే ఘాటైన సమాధానాలతో చర్చల్లో నిలుస్తున్నారు.
తాజాగా “పేట” భామ మాళవికా మోహనన్ కూడా ఈ ట్రోలింగ్స్‌ని ఎదుర్కొంటోంది. మొన్నామధ్య ఓ హాట్ పోజులో ఫోటో పోస్ట్ చేస్తే ఆ ఫోటోకి వచ్చిన నెగిటివ్ కామెంట్స్‌కి తాజాగా ధీటైన సమాధానమిచ్చింది. అంతకుమించిన హాట్ ఫోటోని పోస్ట్ చేసి “నేనింతే.. నాకు నచ్చిన దుస్తులు వేసుకుంటాను. అయినా నేనెలాంటి దుస్తులు వేసుకోవాలో మీరెలా చెబుతారు” అంటూ మండిపడింది. ఈ భామ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో “హీరో” సినిమాలో నటించేందుకు సమ్మతించింది.