‘బిగ్‌బాస్-3’లో శ్రీముఖి

0
59

బుల్లితెర హాట యాంకర్లలో శ్రీముఖి ఒకరు. అనసూయ, రేష్మీ గౌతమ్ తర్వాత అంతటి పాపులరైన్ యాంకర్. పైగా, బుల్లితెరకు మరింత గ్లామర్ తీసుకొచ్చిన ముద్దుగుమ్మ. బుల్లితెరపై ఆమె చేసే అల్లరి యూత్‌కి విపరీతంగా నచ్చేసింది.

విరామం లేకుండా సందడి చేస్తూ, ‘పటాస్’ షోను ఒక రేంజ్‌కి తీసుకెళ్లిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. శ్రీముఖి కోసమే ఈ షో చూసేవాళ్లు ఉన్నారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి శ్రీముఖి ఈ షో నుంచి కొంతకాలం పాటు బ్రేక్ తీసుకుంది. ఈ వార్త వినగానే ఆమె ఫ్యాన్స్ ఒకింత నిరాశకు లోనయ్యారు.

ఆమె ఇలా హఠాత్తుగా బ్రేక్ తీసుకోవడానికి కారణమేమై ఉంటుందా అని అభిమానులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందట. ‘బిగ్ బాస్-3’ సీజన్‌లో పాల్గొనే అవకాశం శ్రీముఖికి వచ్చిందట. ఆ షోలో పాల్గొనడం కోసమే ఆమె బ్రేక్ తీసుకుందనేది తాజా సమాచారం.

టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ షో, జూలై రెండో వారంలో ప్రారంభం కానుందని సమాచారం. సో.. శ్రీముఖి అల్లరి బిగ్ బాస్ హౌస్‌లో ఇకపై వంద రోజుల పాటు చూడొచ్చన్నమాట.