ఆదివారం (19-05-2019) మీ రాశి ఫలితాలు

0
41
daily astro
daily astro

మేషం : సోదరీ, సోదరుల మధ్య అగాహన ఏర్పడుతుంది. మీ లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల ముఖ్యం. అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగస్తులు సమర్ధంగా పనిచేసి పై అధికారుల ప్రాపకం సంపాధిస్తారు. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభం : విద్యార్థులు ఇతరుల కారణంగా మాటపడవలసి వస్తుంది. విరోధులు వేసే పథకాలు తెలివితో తిప్పికొడతారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం.

మిథునం : వ్యాపార ఆర్థిక రహస్యాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. పత్రాక సంస్థలలోని వారికి కీలకమైన వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ సంతానం పై చదువుల కోసం పొదుపు ప్రణాళికల పట్ల దృష్టి సారిస్తారు. బంధువులను కలుసుకుంటారు.

కర్కాటకం : ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. తొందరపడి సంభాషించడం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన గురించి మీ శ్రీమతితో చర్చిస్తారు. ప్రింటింగ్ రంగాలలో వారికి పనిభారం అధికమవుతుంది. కష్టపడని పనిచేస్తే ధనం దానంతటదే వస్తుంది.

సింహం : ఆర్థిక విషయాలలో సంతృప్తి కానరాదు. కొంతమంది మీపై ఆధిపత్యం చెలాయించేందుకు యత్నిస్తారు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. అలౌకిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.

కన్య :
రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి కృషి చేస్తారు. నూతన పరిచయాలేర్పడతాయి.

తుల : నిర్మాణ కార్యక్రమాలలో ప్రోత్సాహం కానవస్తుంది. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. సందర్భానుకూలంగా సంభాషించి సమస్యలకు దూరంగా ఉండండి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ప్రైవేటు సంస్థలలో వారికి సామాన్యంగా ఉంటుంది.

వృశ్చికం : ఉద్యోగస్తులు వ్యాపార రీత్యా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కిపోవుట వలన ఆందోళన పెరుగుతుంది. పాత్ర మిత్రలను కలుసుకుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడుతాయి.

ధనస్సు : ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఇతరులను అతిగా విశ్వసించడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త వహించండి. నూతన వ్యాపారాలు, అగ్రిమెంట్లకు సంబంధించిన విషయాల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. వృధా ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు.

మకరం : స్థిరాస్తి అమ్మాకనికై యత్నాలు వాయిదా పడటం మంచిది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. ఇతరులకు ధనసాయం చేయడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. ఉద్యోగస్తులకు అధికారిక పర్యటనలు, బాధ్యతలు అధికం. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం.

కుంభం : ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కుంటారు. మీ అభిప్రాయాలకు ఇతరులపై బలవంతంగా రుద్దటం మంచిది కాదని గమనించండి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకున్నంత సంతృప్తిగా సాగవు.

మీనం : నిరుద్యోగులు భవిష్యత్ గురించి పథకాలు వేసిన సత్ఫలితాలు పొందుతారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. చేపట్టిన పనులు ఆలస్యంగానైనా పూర్తి చేస్తారు. ఆత్మీయులను విమర్శించుట వలన చికాకులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు.