మోడీ ధ్యానం చేసిన గుహ ప్రత్యేకతలేంటి?

0
45

సార్వత్రిక ఎన్నికల ముగింపుకు ఒక్కరోజు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన పవిత్ర పుణ్యక్షేత్రాలైన కేదర్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను సందర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ముఖ్యంగా, ఆయన పర్యటనలోని తొలి రోజైన శనివారం కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలోని ఓ గుహలో రాత్రంతా ధ్యానముద్రలో నిమగ్నమయ్యారు. సముద్రమట్టానికి దాదాపు 12 వేల అడుగుల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ క్షేత్రంలో అత్యంత చల్లని వాతావరణంలో అంతసేపు ధాన్యం చేయడం మామూలు విషయం కాదు. అయితే, ప్రధాని ధ్యానం చేసిన గుహకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

ఇది రాళ్లను తొలిచి ఏర్పాటు చేసిన గుహ. ఇందులో ధారాళంగా వెలుతురు ప్రవహిస్తుంది. దీనికి అటాచ్డ్ వాష్ రూమ్, కిటికీ కూడా ఏర్పాటు చేశారు. గుహ గోడలకు దుస్తులు తగిలించుకునే హ్యాంగర్లు కూడా ఫిట్ చేశారు. ఇక్కడి నుంచి చూస్తే కేదార్నాథ్ క్షేత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మోడీ రాకతో ఇక్కడ పరుపులు, దిండ్లు, మంచినీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం వంటివి ఏర్పాటు చేశారు.

ఈ గుహను అనేక రాళ్లను, కఠినశిలలను తొలిచి గతేడాదే సిద్ధం చేశారు. అయితే అప్పటినుంచి మూతపడే ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఈ గుహను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించారు. ఈ గుహలోనే మోడీ దాదాపు 20 గంటల పాటు ధ్యానం చేశారు.