మేషం : ఇంటా బయటా స్త్రీల ఆధిపత్యం కొనసాగుతుంది. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం. బద్దకాన్ని వదలి చురుగ్గా ఉండండి. రవణా రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
వృషభం : మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించడం మంచిది కాదు. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. మీకు తెలియకుండానే దుబారా ఖర్చులు చేస్తారు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు.
మిథునం : శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారి పోతాయి. విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. సోదరీ సోదరులు, సన్నిహితులకు సంబంధించి ఖర్చులు అధికం.
కర్కాటకం : గృహంలోని మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. రాజకీయాల్లో వారికి ఆదరాభిమానాలు అధికం అవుతాయి. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టటం వల్ల కాంట్రాక్టర్లు సమస్యలకు లోనవుతారు. భాగస్వామ్యుల మధ్య విభేదాలు సృష్టించేవారు అధికం అవుతున్నారని గమనించండి. స్పెక్యులేషన్ అనుకూలించదు.
సింహం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యం. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్‌ఎస్టేట్ రంగాల వారికి ఆశాజనకం. ముఖ్యులతో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్నతరహా, కుటీరపరిశ్రమల వారికి ఆశాజనకం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
కన్య : కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి తప్పదు. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సంఘంలో ఉన్నతస్ధాయి వ్యక్తుల సహాయం పొందుతారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేయవలసి ఉంటుంది. రాజకీయాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది.
తుల : వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తప్పవు. ఉద్యోగస్తులకు ఒక అవకాశం చేతిదాకా వచ్చి వెనక్కిపోయే ఆస్కారం ఉంది. ఆరోగ్య, ఆహార విషయాల్లో అధికమైన జాగ్రత్త అవసరం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు.
వృశ్చికం : నిరుద్యోగులలో నిరుత్సాహం, నిర్లిప్తత అధికమవుతాయి. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చకండి. ప్రేమికులకు మధ్య ఊహించని స్పర్ధలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. కాంట్రాక్టర్లకు సదవకాశాలు లభించిన ఒత్తిడి తప్పదని చెప్పవచ్చు.
ధనస్సు : ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేయటం వల్ల ఇబ్బందులకు గురికావలసివస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం. బద్దకాన్ని వదలి చురుగ్గా ఉండండి. రవణా రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
మకరం : ఆడిటర్లకు అభివృద్ధి, ప్లీడర్లకు, వైద్యులకు గుర్తింపు పొందుతారు. పారిశ్రామిక రంగంలోని వారి సమస్యలు ఒక కొలిక్కిరాగలవు. పెద్దల సలహాను పాటించి గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మిత్రులతో సంభాషించటం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటాయి. రుణాలు తీరుస్తారు.
కుంభం : మీ పాత సమస్యలు, స్ధిరాస్తి వివాదాలు ఒక కొలిక్కిరావటానకి మరి కొంత సమయం పడుతుంది. కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. విద్యార్ధినులలో ఏకాగ్రత లోపం వల్ల చికాకులు, మందలింపులు తప్పవు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, ఆరోగ్య విషయంలోను ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఖర్చులు అధికమవుతాయి.
మీనం : వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ప్రైవేటు, పత్రికా సంస్థల్లో వారికి మార్పులు అనుకూలించవు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం వసూలు శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు.