కమల్ హాసన్‌కు ముందస్తు బెయిల్…

0
75

స్వ‌తంత్ర భార‌త‌దేశ‌పు మొట్ట‌మొద‌టి ఉగ్ర‌వాది నాథూరామ్ గాడ్సే అంటూ వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, మక్కల నీది మయ్యం అధ్యక్షుడు క‌మ‌ల్‌ హాస‌న్‌కు మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

త‌మిళ‌నాడులోని అర‌వ‌కురుచ్చి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక‌ల కోసం ప్ర‌చారం చేస్తూ క‌మ‌ల్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కారూర్ జిల్లాలోని అర‌వ‌కుచ్చి పోలీసులు క‌మ‌ల్‌పై కేసును రిజిస్ట‌ర్ చేశారు.

హిందూ అతివాదులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఆ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐపీసీలోని 153ఏ, 295ఏ కింద కేసుల‌ను న‌మోదు చేశారు. మ‌త‌విద్వేషాలు రెచ్చగొడుతున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై కేసు న‌మోదు అయ్యింది.

త‌న‌కు ఉన్న మంచి పేరును చెడ‌గొడుతున్నార‌ని క‌మ‌ల్ అన్నారు. మ‌హాత్ముడిని చంపిన గాడ్సేనే త‌న పుస్త‌కంలో గాంధీని ఎందుకు చంపాల్సి వ‌చ్చింద‌న్న విష‌యాన్ని చెప్పాడ‌ని క‌మ‌ల్ పోలీసులకు తెలిపారు.

తాను హిందువున‌ని, దేశాన్ని విభ‌జించినందుకు గాంధీని హ‌త‌మార్చిన‌ట్లు గాడ్సేనే పుస్త‌కంలో పేర్కొన్నాడ‌ని క‌మ‌ల్ చెప్పారు. ముంద‌స్తు బెయిల్ ష‌ర‌తుల‌కు అంగీక‌రిస్తున్న‌ట్లు క‌మ‌ల్ తెలిపారు.