పడక గదుల్లో రెచ్చిపోయాం.. అందుకే గర్భం.. నేహా ధుపియా లవర్

0
40

బాలీవుడ్ నటి నేహా ధుపియా. సీనియర్ నటి. ఈమె ఓ కుర్ర హీరో అంగద్ బేడీతో ప్రేమలో పడింది. పెళ్లికి ముందు డేటింగ్ పేరుతో ఇష్టానుసారంగా తిరిగారు. అర్థరాత్రిళ్ల వరకు పబ్బుల్లో వినోదాల పేరుతో రచ్చరచ్చ చేశారు. ఆ తర్వాత పడక గదుల్లో రెచ్చిపోయారు. ఇంకేముందు.. నేహా ధుపియా గర్భందాల్చింది.

ఈ విషయం బయటకు పొక్కకముందే చడీచప్పుడు లేకుండా రాత్రికి రాత్రే పెళ్లి చేసుకున్నారు. ఇంత సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ అప్పట్లో మీడియా చాలా కథనాలు వెలువరించింది. ఎట్టకేలకు ఈ వార్తలపై అంగద్ బేడీ స్పందించారు.

ఓ టీవీ షోలో పాల్గొన్న అంగద్ బేడీ, నేహాతో సీక్రెట్ మ్యారేజ్‌పై మాట్లాడుతూ, నేహా పెళ్లికి ముందే తన ద్వారా గర్భవతి అయిందని, ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసి పెద్ద రచ్చ అయిందని వెల్లడించాడు. అందుకే ఆఘమేఘాల మీద పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ప్రకటించాడు.

మే 10వ తేదీన వీళ్లిద్దరూ రహస్యంగా పెళ్లిచేసుకున్నారు. అప్పటికే నేహా ధూపియా గర్భవతి. కానీ ఆ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే అప్పటికి నేహా చేతిలో ఓ సినిమా ఆఫర్ ఉంది. నేహా ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఎక్కడ ఆ సినిమా నుంచి ఆమెను తీసేస్తారో అని భయపడి అప్పట్లో ఆ విషయాన్ని బయటకు చెప్పలేదంటున్నాడు అంగద్. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది నేహా ధూపియా.