ఈ నెల 30వ తేదీ నుంచి ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే భారత క్రికెట్ తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. నిజానికి వరల్డ కప్ జట్టును కొన్నిరోజుల క్రితమే 15 మంది సభ్యులతో ఎంపిక చేసినా, ఇప్పుడా 15 మందితోనే ఎలాంటి మార్పులు లేని తుది జట్టును ప్రకటించారు.
మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ ఫిట్నెస్ సాధించడంతో తన స్థానం నిలుపుకున్నాడు. జాదవ్ ఫిట్నెస్ సాధించకపోతే అంబటి రాయుడుకు అవకాశం దక్కేదన్న అంచనాల నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి మార్పులు లేని తుది జట్టును ప్రకటించింది.
ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టు ఇదే…
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ (సెకండ్ వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్.