నాజుకు తనానికి నిర్వచనంలా ఉన్న ఆమె అలా తయారైపోయింది..

0
65

తెలుగు సినీ ప్రేక్షకులకు శరణ్యా మోహన్ గుర్తుండే ఉంటుంది. ఆమె చేసింది తక్కువ చిత్రాలే. కానీ, అవి చాన్నాళ్లు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. తెలుగులో ఈమె చేసిన సినిమాల పేర్లను చెప్పాలంటే ‘విలేజ్‌లో వినాయకుడు’, ‘భీమిలి కబడ్డీ జట్టు’ వంటి సినిమాలు ఉన్నాయి. తమిళంలో కూడా ఒకటి రెండు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలో చెల్లెలు తరహా పాత్రలు చేసి మెప్పించింది.

ఈ భామ హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయిన ఈమె తర్వాత పెళ్లి చేసుకుని సెటిలైంది. ఇటీవలే తల్లి కూడా అయ్యిందట. తాజాగా ఫేస్‌బుక్‌లో ఈమె ఫొటో ఒకటి షేర్ అవుతూ ఆశ్చర్యపరుస్తోంది. నాజుకు తనానికి నిర్వచనంలా ఉండిన శరణ్య పూర్తిగా మారిపోయింది.

తల్లి అయిన తర్వాత వచ్చే సహజమైన శారీరక మార్పులతోనే శరణ్య ఇలా కనిపిస్తోందని తెలుస్తోంది. చాలా మంది హీరోయిన్లు కూడా వివాహానంతర, ప్రసవానంతరం శారీరకంగా ఇలానే మారారు. ఐశ్వర్యరాయ్ కూడా ఇలానే మారి మళ్లీ తన ఫిజిక్‌ను తిరిగి సంపాదించుకోగలిగింది.