ననేను రెఢీ.. మీరు రెఢీనా.. హీరోలకు సవాల్ విసురుతున్న హీరోయిన్

0
43

టాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్లలో ఈషా రెబ్బా ఒకరు. ఈమె తెలుగు పిల్ల. హైదరాబాద్‌లో పుట్టిపెరిగింది. తెలుగు తెరపై ఇతర భాషా నటీమణులు రాణిస్తుండగా.. తమకేం తక్కువ అన్నట్లుగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. పైగా, ఈషా రెబ్బా అందానికేం కొదవలేదు. ముంబై భామలను మించిన గ్లామర్ ఈమె సొంతం.

కానీ ఆమె అనుకున్నట్లుగా ఇండస్ట్రీ నుంచి అవకాశాలు సరిగ్గా రావడం లేదు. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా, అందాల ఆరబోతలో ఆంక్షలు విధిస్తున్నట్టు సమాచారం. మరోవైపు, దర్శక నిర్మాతలు, హీరోలతో సఖ్యత అంతంతమాత్రంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ విషయాన్ని గ్రహించిన ఈషా.. ఇటీవలి కాలంలో అందాల ఆరబోతకు దిగింది. సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది. దీంతో ఓ టాలీవుడ్ మ్యాగజైన్ ఏకంగా తమ కవర్ పేజీగా ఈషా అందాలనే ఎంచుకోవడం విశేషం.

‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈషా… ఆ తర్వాత ‘బందిపోటు’, ‘అమీ తుమీ’ వంటి సినిమాల్లో నటించింది. కానీ, ఆ చిత్రాలన్నీ నటనాపరంగా ఆమెకు పెద్ద బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ఈ తరుణంలో నాని నిర్మాణంలో తెరకెక్కిన ‘అ’ మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈ మద్యే త్రివిక్రమ్-ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటించింది. ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో సినిమాలో చేసింది కాబట్టి ఈషా దశ తిరిగినట్లే అని భావించారంతా. అయినప్పటికీ మళ్ళీ ఆమెకు నిరాశే ఎదురైంది. అందుకే అందాల ఆరబోతకు ఉత్తరాది భామలకు ఏమాత్రం తీసిపోనని ఈ భామ చెప్పడమే కాదు.. సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది.