చాలామంది సెలెబ్రిటీలు తాము చేసే చిన్నతప్పు కారణంగా అనేక విమర్శలు ఎదుర్కొంటారు. మరికొందరు వివాదాల్లో చిక్కుకుని సంపాదించుకున్న పేరుప్రతిష్టలను పోగొట్టుకుంటారు. ఇలాంటి వారిలో చిన్మయి ఒరు. సౌత్ ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పేరున్న చిన్మయి ఇటీవల లైంగిక వేధింపులకు గురైంది.
ఈ క్రమంలో ఓ నెటిజన్ అడిగి ప్రశ్నకు ఆమె దిమ్మ తిరిగేలా ఆన్సర్ చెప్పింది. ఇంతకు ఏం జరిగిందంటే.. ఇంటర్నెట్ ఛాటింగ్‌లో సింగర్ చిన్మయి ఎలాంటి విషయం గురించయినా ముఖంపైనే ఉన్నదున్నట్టు చెప్పేస్తుంది. లైంగిక వేధింపుల విషయంలో సినీ గేయ రచయిత వైరముత్తు, రాధారవిని బజారుకీడ్చింది. అలా ఎవరినైనా మాటలతో ధీటుగా సమాధానం చెప్ప చిన్మయికి మరోసారి ఆసక్తికరమైన సంఘటన ఎదురైంది.
ఓ వ్యక్తితో ఛాటింగ్ సందర్భంగా నీ నగ్న చిత్రాలు పంపు అంటూ మెసేజ్ పెట్టాడు. దాంతో ఆమె వెంటనే తన సమయస్ఫూర్తిని ఉపయోగిస్తూ స్పందించింది. నగ్న చిత్రాలు అడిగితే.. చిన్మయి జవాబు ఇలా నగ్న చిత్రాలను పంపమని అడిగిన వ్యక్తికి తన వద్ద ఉన్న న్యూడ్ లిప్‌స్టిక్స్‌ను పోస్ట్ చేసింది. దాదాపు 30 వరకు లిప్‌స్టిక్ ఫోటోలను షేర్ చేసి.. ఆ వ్యక్తి దిమ్మతిరిగే విధంగా సమాధానం చెప్పింది.
చిన్మయి వ్యవహరించిన తీరు ప్రతీ ఒక్కరిని నవ్వుల్లో ముంచెత్తేసింది. ప్రతీ ఒక్కరు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. వాట్సాప్ ఛాట్‌ను షేర్ చేసిన చిన్మయి తన వాట్సాప్ చాట్‌ను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఆటలో ఇదో అరటిపండు. నాకు కొంత ఎంటర్‌టైన్‌మెంట్ అని చిన్మయి కామెంట్ పెట్టింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఆమెకు ఎదురయ్యాయి. పలువురు ఆమెపై ఇంటర్నెట్ వేధింపులకు పాల్పడితే.. ఇలానే గట్టిగా బుద్ది చెప్పిన సందర్భాలు లేకపోలేదు.