మళ్లీ కెమెరా ముందుకు అజ్ఞాతవాసి..

0
44

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” చిత్రం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. రూ.కోట్ల ఆదాయాన్ని వదులుకుని ప్రజాజీవితంలోకి అడుగుపెట్టిన పవన్… తన ఎన్నికల ప్రచారంలో కూడా పదేపదే ఇదే మాటను చెప్పారు. ప్రజాసేవ కోసమే వచ్చానని చెప్పుకుంటూ వచ్చారు. దానికి తగినట్లే, తన శరీరాకృతిని పట్టించుకోకుండా రాజకీయాల్లో తిరిగారు. జుట్టు, గెడ్డం భారీగా పెంచారు. దానికి తగినట్లు బాడీ కూడా కాస్త పెరిగింది.

అయితే, ఈ యేడాది డిసెంబరు నుంచి పవన్ సినిమాల్లోకి వస్తారనే టాక్ ఫిల్మ్ నగర్‌లో బాగా వినిపిస్తోంది. సినిమాలు చేయకుంటే పవన్‌కు ఆదాయం ఎలా? అని ఆయన సన్నిహితులు కూడా అంటున్నారు. త్రివిక్రమ్-కొరటాల శివ ఇలా కాస్త పేరున్న డైరక్టర్లతో సినిమా చేయాలని పవన్‌కు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇందుకోసం తన శరీరాకృతిని మళ్లీ సరిదిద్దుకోవాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కొన్ని ఆధునిక జిమ్ పరికరాలకు పవన్ ఆర్డర్ ఇచ్చారని, ఇవి బెంగుళూర్ నుంచి రావాల్సి వుందని తెలుస్తోంది. వీటి ద్వారా కాస్త సన్నబడడం, అక్కర్లేని చోట్ల పేరుకున్న ఫ్యాట్ను కరిగించుకోవడం వంటివి సాధ్యమవుతాయని టాక్. మొత్తం మీద పవన్ తన శరీరాకృతి మీద దృష్టి పెట్టడం ఆయన అభిమానులకు కచ్చితంగా సంతోషం కలిగించేవారే.