రాజన్న సుపరిపాలన అందించడమే లక్ష్యం : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

0
44
YS Jaganmohan Reddy
YS Jaganmohan Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుందని అనేక ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చాయి. దీంతో ఆ పార్టీ శ్రేణులు తమ పార్టీ అధినేత జగన్ సీఎం కావడం ఖాయమని నేతలు పదేపదే జోస్యం చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో జగన్ ఓ ఆసక్తికర పోస్టర్‌ను పోస్ట్ చేశారు. రాజన్న సుపరిపాలనను తీసుకురావాలన్నదే తన సంకల్పమని అందులో పేర్కొన్నారు. ఈ పోస్టర్‌లో నవ్వుతూ మైకు పట్టుకుని జగన్ ఉండటం గమనించవచ్చు.

ప్రజాస్వామ్యంలో ‘ప్రజాపరిపాలనే సాగాలి’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ పోస్టర్‌పై మండు టెండల్ని సైతం లెక్కజేయకుండా క్యూలలో నిలబడి ప్రజలు ఓట్లేశారని, ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనాన్ని నిలబెట్టారని, వారి ఆశీస్సులు అందిన వేళ వారికి బాధ్యుడినై ఉంటానని రాశారు.