ఎక్కడ లెక్క తప్పింది ?

0
57

40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా కానీ టిడిపి అధినేత చంద్రబాబుకి కలిసిరాలేదు. నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రిగా రికార్డ్‌ లకెక్కిన చంద్రబాబు ఆ ఊపుని కంటిన్యూ ఎందుకు చేయలేకపోయారు. 2019లో మళ్లీ టీడీపీదే అధికారమన్న బాబుగారి లెక్క ఎక్కడ తప్పింది. కనీసం బలమైన ప్రతిపక్షంగా కూడా ఎందుకు నిలవలేకపోయింది. ఇప్పుడిదే తెలుగుతమ్ముళ్లతో పాటు రాజకీయవిశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తున్న విషయం. ఈసారి ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ప్రభుత్వ వైఫల్యాలే. రాజధాని పేరుతో వేల ఎకరాలను సేకరించిన చంద్రబాబు తాత్కాలిక భవనాలతో సరిపెట్టేశాడు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ లేవనెత్తే ప్రశ్నలకు సమాధానలు చెప్పలేక తోటిమంత్రులతో జగన్‌ కేసులు, అవినీతిని లెవనెత్తి ఆ పార్టీ నేతలను సస్పెండ్‌ చేసింది. ఇక అధికారంలో ఉన్నమన్నా ధీమాతో మంత్రులు, పార్టీ నేతలు ఇష్టానురాజ్యంగా వ్యహరించారన్న ఆరోపణలున్నాయి. దేవినేని, బోండా ఉమా, చింతమనేని దౌర్జన్యాలు, ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. మంత్రి నారాయణ, గంటాలకు చెందిన విద్యాసంస్థల్లో ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. దీనికి తోడు గత ఎన్నికల్లో మిత్రుడిగా వ్యహరించిన పవన్‌ కల్యాణ్‌ ఎదురుతిరగడం చంద్రబాబుకి మైనస్‌ గా మారింది. జనసేన పార్టీని ఈఎన్నికల బరిలోకి దింపడమేకాకుండా చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్, ఇతర మంత్రుల అవినీతిని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించడం టిడిపికి గట్టి దెబ్బేసింది. ఇక ప్రత్యేక హోదాపై చంద్రబాబు ద్వందవైఖరి ప్రజల్లో అసహనం కలిగించిందన్న టాక్‌ వినిపిస్తోంది. ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ బెస్ట్‌ అని చెప్పిన చంద్రబాబు బీజేపీతో కటీఫ్‌ చెప్పిన తర్వాత హోదా కావాలంటూ ఢిల్లీలో ఆందోళనలు చేయడం వంటి పనులతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారంటున్నారు రాజకీయవిశ్లేషకులు. వైసీపీ ఎంపీలంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తే వాళ్లతో కలిసి పోరాడకుండా ఒంటరిగా మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం కూడా చంద్రబాబు ఫెయిల్యూర్స్‌ లో ఓ కారణంగా చెబుతున్నారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారం కూడా చంద్రబాబు కొంపముంచింది. సుజనా చౌదరిపై ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ దాడులు, సిఎం రమేష్‌ చేసిన ఉక్కుదీక్షలు టిడిపికి నష్టాన్నే తెచ్చిపెట్టాయి. జగన్‌ పై జరిగిన దాడిని చులకనగా చేస్తూ కోడికత్తి డ్రామా అంటూ విమర్శలు చేయడం, వివేకానంద రెడ్డి హత్యని రాజకీయంగా వాడుకోవడం కూడా చంద్రబాబుపై నెగిటివిటీని పెంచాయి. అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తిరుమల తిరుపతి దేవస్థానంపై వచ్చిన ఆరోపణలు ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి. స్వామి వారి నగలు, హుండీ ఆదాయం తదితర విషయాలపై టిటిడి మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలు కూడా చంద్రబాబుకి నష్టాన్ని కలిగించాయి. ఇలా చెప్పుకుంటే పోతే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటిడిపి…….. ప్రభుత్వ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయింది. కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో జగన్ని విమర్శించడానికే చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ప్రాధాన్యత నివ్వడంతో ఈ 2019 ఎన్నికల్లో టిడిపి అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.