ఎన్నికల ఫలితాలు.. పులివెందులలో జగన్.. ఖమ్మంలో రేణుకాచౌదరి

0
41
election results
election results

ఎన్నికల ఫలితాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్డీయే పక్షాలు 100 స్థానాల ఆధిక్యంలో ఉన్నాయి. వాటిలో బీజేపీ 93 స్థానాలు ఆధిక్యంలో ఉంది. అటు యూపీఏ పక్షాలు 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 18 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 22 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. ఈ రకంగా చూస్తే… మరోసారి బీజేపీ లేదా ఎన్డీయే పక్షాలతో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కర్ణాటక, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, బెంగాల్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మైసూర్‌ లోక్ సభ స్థానంలో బీజేపీ మందంజలో ఉన్నట్లు తెలిసింది. మిగతా చాలా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందుంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో 16 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ ఒక్క స్థానంలో ముందంజలో ఉన్నాయి.

కర్ణాటకలో కుమారస్వామి కొడుకు నిఖిల్ వెనకంజలో ఉన్నారు. అక్కడ సుమలత లీడింగ్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో ఎంఐఎం ఆధిక్యంలో ఉంది. మంగళగిరిలో నారా లోకేష్ ఆధిక్యంలో ఉన్నారు. విజయనగరం చీపురు పల్లిలో బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నారు.

అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు, అభ్యర్థి రాహుల్ గాంధీ వెనకంజలో ఉన్నారు. అమేథీలో సర్వర్ సమస్యతో కౌంటింగ్ నిలిపివేశారు. వారణాసిలో ప్రధాని మోదీ ఆధిక్యంలో ఉన్నారు. రాయ్ బరేలీలో సోనియాగాంధీ మరోసారి ఆధిక్యంలో ఉన్నారు. శ్రీనగర్‌లో ఫరూక్ అబ్దుల్లా లీడ్‌లో ఉన్నారు. సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. పులివెందులలో వైఎస్ జగన్ ముందంజలో ఉన్నారు. బెంగళూరులో ప్రకాష్ రాజ్ వెనకంజలో ఉన్నారు. ఖమ్మంలో రేణుకా చౌదరి ముందంజలో ఉన్నారు. చీపురు పల్లి, నెల్లూరు, కావలిలో వైసీపీ ముందంజలో ఉంది.

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వైసీపీ ఆధిక్యంలో ఉంది. బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ నువ్వా-నేనా అన్నట్లు కొనసాగుతున్నాయి. రాయలసీమలో వైసీపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. శివగంగలో కార్తీ చిదంబరం ముందంజలో ఉన్నారు. తూర్పు ఢిల్లీలో గౌతం గంభీర్ ముందంజలో ఉన్నారు.

ఖమ్మం పార్లమెంట్ స్థానంలో నామా నాగేశ్వరరావు ముందంజలో ఉన్నారు. కేరళలో కూడా బీజేపీ జోరుగా ఉందని తెలిసింది. అనంతపురం లోక్ సభ స్థానంలో వైసీపీ ఆధిక్యంలో ఉంది.

మెదక్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. గుంటూరు వినుకొండ అసెంబ్లీ స్థానంలో వైసీపీ ఆధిక్యంలో ఉంది. మైదుకూరు అసెంబ్లీ సీటులో వైసీపీ ఆధిక్యంలో ఉంది. హిందూపురంలో బాలకృష్ణ ఆధిక్యంలో ఉన్నారు.

పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మంలో రేణుకాచౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి భరత్ లోక్ సభ స్థానానికి ఆధిక్యంలో ఉన్నారు. అరకులో వైసీపీ ఆధిక్యంలో ఉంది.