చరిత్ర సృష్టించాడు

0
44
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

అప్పుడు నాన్న ఇప్పుడు కొడుకు. వీళ్లిద్దరూ రాజకీయాల్లో స్టార్‌ హీరోలు. రాష్ట్రం విడిపోయాక జరిగిన ఎన్నికల్లో జగన్‌ ఓడిపోయినా టిడిపికి బలమైన ప్రతపక్షంగా నిలిచాడు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా సరే వైసీపీని అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోన్న జగన్‌కి పవన్‌కల్యాణ్‌ రూపంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. జనసేనపార్టీతో ఈ ఎన్నికల్లో పవర్‌ స్టార్‌ గట్టిపోటీ ఇచ్చాడు. సినీ స్టార్‌ గా కోట్లదిమంది అభిమానులున్న పవన్‌ కల్యాణ్‌ ఈ సారి ఎన్నికల్లో సత్తా చూపిస్తాడని , జగన్‌కే ఎక్కువ ఎఫెక్ట్‌ అవుతుందని రాజకీయ విమర్శకులు ఓ అంచనాకు వచ్చారు. అందువల్లే 2019 ఎన్నికలు ఉత్కంఠంగా మారాయి. ఎగ్జిట్‌ , ప్రీ పోల్స్‌ ….ఫలితాలు సైతం ఏపీలో అధికారాన్ని అందుకునేది ఏ పార్టీ అన్నది చెప్పలేకపోయాయి. ఓవైపు చంద్రబాబు చాణక్యతంత్రాలు, పవర్‌ స్టార్‌ రాకతో ఏపీ పాలిటిక్స్‌లో టెన్షన్‌ నెలకొంది. ఈ క్లిష్టపరిస్థితులన్నింటిని ఛేదించుకొని వైఎస్‌ జగన్‌ ఏపీలో అధికారాన్ని అందుకున్నారు. గెలుపు గీతని దాటి పూర్తి మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు. 2009 ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గెలవడం కష్టమన్నారు. ఎందుకంటే టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయాల్లోకి రావడమే కాదు ప్రజారాజ్యంపార్టీతో ఎన్నికల బరిలోకి దిగాడు. మార్పు అనే నినాదంతో ప్రజారాజ్యం పార్టీ రాజకీయాల్లోకి వచ్చిందని చెబుతూ అధికారంలోకి రావాలని కలలు కన్నాడు. అయితే వైఎస్‌ ప్రభంజనం ముందు చంద్రబాబు వ్యూహాలు, మెగాస్టార్‌ ఛరిష్మా కలిసిరాలేదు. మళ్లీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజశేఖర్‌ రెడ్డే రెండో సారి ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు వైఎస్‌ , చిరంజీవితో పోటీపడితే ఇప్పుడు జగన్‌ పవన్‌ కల్యాణ్‌ తో పోటీపడి తండ్రిలానే తెరపై హీరోలను ఓడించి రియల్‌ హీరోలుగా రాజకీయాల్లో ఓ చరిత్ర సృష్టించారు.