తోడు నీడగా ఉండి…!

0
64
Vijay Saireddy
Vijay Saireddy

టిడిపికి అధికారం దూరం చేసి, ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ విజయకేతనాన్ని ఎగరేసిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సక్సెస్‌లో కీలకపాత్ర వహించింది కెవిపీనే. తెలుగు గడ్డపై అధికారం కోసం ఆశగా ఎదురుచూస్తున్న హస్తం ఆశలను నిజం చేయడంలో వైఎస్‌ కి అన్నివిధాల అండగా నిలిచింది కె రామచంద్రరావు అన్న విషయం తెలిసిందే. 2004, 2009లో రెండు సార్లు వరసగా కాంగ్రెస్‌ అధికారాన్ని అందుకోవడానికి వైఎస్‌ పాలనే కాదు కెవివి రాజకీయవ్యూహాలు కూడా కారణం. ఇప్పుడు అలానే జగన్‌ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కీలకమైన వ్యక్తుల్లో ముందుగా వినిపించే పేరు విజయసాయిరెడ్డి. వైఎస్‌ మరణానంతరం సిఎం అవ్వాలనుకున్న జగన్‌ ఆశలపై కాంగ్రెస్‌ నీరుచల్లింది. దీంతో ఆపార్టీ నుంచి బయటకొచ్చిన జగన్‌ కి అండగా నిలిచివారిలో విజయసాయిరెడ్డి ఒకరు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడంటూ జగన్‌ పై లెక్కలేనన్ని అవినీతి కేసులు నమోదయ్యాయి. అందులో విజయసాయిరెడ్డి పాత్ర కూడ ఉందని ఆయనపై కూడా కేసులు ఉన్నాయి. అయితే వీటన్నింటికి భయపడక సొంతంగా తండ్రి పేరుతో వైఎస్‌ జగన్‌ పార్టీ పెట్టి జనాల్లోకి రావడంతో ఆయన్ను జైల్లోకి పంపారు. జగన్‌ తో పాటు విజయసాయిరెడ్డి కూడా జైలు జీవితం గడిపారు. ఇలా కష్టసుఖాల్లో అన్నింటిలోనూ వైఎస్‌ జగన్‌ కి అండగా ఉన్నారు విజయసాయిరెడ్డి. రాష్ట్రం విడిపోయాక జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపి అధికారంలోకి రాలేకపోవడంతో చాలామంది పార్టీని విడిచి వెళ్లిపోయారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం జగన్ని వీడలేదు. ఆయన వెన్నంటే ఉంటూ వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి శాయసక్తులా కృషి చేశారు. చంద్రబాబు ఎత్తులకు జగన్‌ తో కలిసి ప్రతివ్యూహాలు రచిస్తూ పార్టీని బలోపేతం చేశారు. ముఖ్యంగా కేంద్రంలో వైసీపీ బలమైన పార్టీగా , జగన్‌ కీలకమైన లీడర్‌ గా చూపించడంలో విజయసాయిరెడ్డి సక్సెస్‌ అయ్యాడు. వైఎస్‌ కి కెవిపి ఎలానో …జగన్‌కి విజయ్‌ సాయిరెడ్డి ముందుండి నడిపించే మిత్రుడని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.