ఆయన సర్వేలు నమ్మితే నట్టేట మునిగినట్టే. ఇప్పుడీ మాట ఏపీలో ఓ పెద్ద జోక్ గా మారింది. ఇంతకీ ఏ జోక్ ఎవరి గురించో మీకు అర్థమైపోయింది కదా. సవాళ్ల రాయుడు లగడపాటి మళ్లీ ఫెయిల్ అయ్యాడు. ఈ సర్వేరాయుడి లెక్క మళ్లీ తప్పింది. ఏపీలో మళ్లీ టిడిపీదే అధికారమని, అలా కాకపోతే ఇక ఎగ్జిట్ పోల్స్ చేయడం మానేస్తానని సవాలు విసిరాడు. వైసీపీ గట్టిపోటీ మాత్రమే ఇస్తుంది కానీ అధికారం అందుకోలేదని జోస్యం చెప్పాడు లగడపాటి. అయితే ఆయన చేసిన సర్వే తప్పని నిరూపిస్తూ వైసీపీ పూర్తి మెజార్టీతో ఏపీలో అధికారాన్ని అందుకుంది. ఈసారి ముఖ్యమంత్రి అయ్యేది జగనే అన్న పార్టీ నేతల నమ్మకాన్ని ప్రజలు నిలబెట్టారు. తిరుగులేని ఆధిక్యంతో ఏపీలో వైసీపీ గెలుపుజెండాని ఎగరేసింది. కొన్ని నెలల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ లగడపాటి సర్వే తుస్ మంది. ఈసారి కెసిఆర్ గెలవడం కష్టమని, కాంగ్రెస్ కే తెలంగాణ ప్రజలు పట్టంకడతారని లగడపాటి ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ కెసిఆర్ ప్రతిపక్షం లేకుండా భారీ మెజార్టీతో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. దీంతో లగడపాటి సర్వేపై విశ్వాసం తగ్గింది. ఇప్పుడు ఏపీలోనూ ఫెయిల్ అయి లగడపాటి జోకర్ గా మారాడు. అంతేకాదు ఇక ఎగ్జిట్ పోల్స్ మానేసి ఓ మూలకూర్చోమంటూ లగడపాటికి వైసీపీ శ్రేణులు సలహా ఇస్తున్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -