నువ్వు సూపరహే…!

0
44
Prasanth Kishore
Prasanth Kishore

ఆయన స్కెచ్‌ వేశాడంటే ఇక అంతే. ఎంతటి మొనగాడైనా సరే చిత్తు అవ్వాల్సిందే ! అలాంటి మెరుపులాంటి ప్లానర్‌ ఇప్పుడు మళ్లీ తన సత్తా చూపించాడు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆ మహానేతని చిత్తుచేశాడు. ఇంతకీ ఎవరా కత్తిలాంటి ఖతర్నాక్‌ అంటే ప్రశాంత్‌ కిషోర్‌ అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఏపీలో వైసీపీ అధికారంలో రావడానికి మెయిన్‌ కారణం ప్రశాంత్‌ కిషోరే. ఏ విధంగా ప్లాన్‌ చేస్తే రాజకీయ పార్టీలు అధికారాన్ని అందుకుంటాయో ఈయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. మీడియా, సోషల్‌ మీడియా ద్వారా ఏ రకంగా ప్రజలను ఆకట్టుకోవచ్చో ప్రశాంత్‌ కిషోర్‌ కి బాగా తెలుసు. అందుకే గుజరాత్‌ సిఎం గా ఉన్న మోదీ భారత ప్రధాని అవ్వడానికి ప్రశాంత్‌ కిషోర్‌ అనే బాణాన్ని ఉపయోగించాడు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవడానికి ప్రశాంత్‌ కిషోర్‌ మాస్టర్‌ మైండే కారణం. మీడియా కన్నా సోషల్‌ మీడియా ఎంతో పవర్‌ ఫుల్‌. ఈ పాయింట్ నే ఆసారాగా చేసుకొని ప్రశాంత్‌ కిషోర్‌ తన వ్యూహాన్ని రచిస్తారు. ప్రతిపక్షాల వైఫల్యాలను ఎత్తి చూపేంచే ప్రకటనలు, ప్రచారాలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తాడు. ఇంకేముంది ఎంతటి చరిత్ర ఉన్న పార్టీ అయినా, పొలిటీషియన్‌ అయినా చేతులెత్తేయాల్సిందే. అలా వికసించని కమలానికి 2014లో ఆక్సిజన్‌ అందించాడు ప్రశాంత్‌ కిషోర్. వాజ్‌ పేయి తర్వాత మళ్లీ అధికారం అందుకోలేకపోయిన బీజేపీకి ప్రశాంత్‌ కిషోర్‌ రూపంలో ఆలోటు తీరింది. మోదీ ప్రధానిగా భారీ మెజార్టీతో బీజేపీని ఢిల్లీ గద్దెపై కూర్చోబెట్టారు. ఇప్పుడు జగన్ కూడాఏపీలో అధికారంలోకి రావడానికి ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాలే కారణం. సోషల్ మీడియాలో వైసీపీపార్టీని ఎప్పటికప్పుడు అలర్ట్‌ చేస్తూ , చంద్రబాబు వైఫల్యాలను ప్రజలకు చేరవేస్తూ ప్రశాంత్‌ కిషోర్ అండ్‌ టీమ్‌ పైచేయి సాధించగలిగింది. మెరుపు వ్యూహాలతో ప్రశాంత్ కిషోర్‌ వేసిన ప్లాన్లు ఫలించి వైఎస్‌ జగన్ సిఎం అయ్యాడు.