పాఠాలు నేర్చుకో బాబూ…!

0
78
Nara Lokesh
Nara Lokesh

మొదటిసారి ప్రతక్ష ఎన్నికల్లో దిగిన అబ్బాయి లోకేష్‌ ఓడిపోయాడు. తండ్రి కుప్పంలో గెలిస్తే కొడుకు మంగళగిరిలో ఓటమిని చూశాడు. వైసీపీ అధినేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో ఓడిపోయాడు. తండ్రి చంద్రబాబు అధికారంలో ఉండగా ఎమ్మెల్సీ హోదాలో ఏపీ ఐటీమంత్రిగా పనిచేసిన లోకేష్‌ ఈ ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాడు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన లోకేష్‌ కి చేదు అనుభవం ఎదురైంది. అసలు లోకేష్‌ ఓటమికి కారణాలేంటి అంటే రాజకీయ అనుభవం లేకపోవడమే అంటున్నారు. గతంలో ఎప్పుడూ కూడా లోకేష్‌ టిడిపి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. రాష్ట్రం విడిపోయాక టిడిపి అధికారంలోకి రావడంతో లోకేష్‌ రాజకీయాల్లో బిజీ అయ్యాడు. అసలు తెలుగుదేశంపార్టీ ఎప్పుడు ఆవిర్భవించిందో కూడా తెలియని లోకేష్‌ కి అనుభవం లేకపోయినా తండ్రి ముఖ్యమంత్రి కావడంతో కేబినెట్‌ లో చోటు అందుకున్నాడు. చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి లోకష్‌ లో ఆలక్షణాలేవీ లేవని టిడిపి శ్రేణులు సైతం అంగీకరించాయి. ఏప్రిల్‌ 11న తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయని అందరికీ తెలుసు. అయితే లోకేష్‌ మాత్రం ఆ విషయాన్ని మర్చిపోయి ఏప్రిల్‌ 9న జరిగే ఎన్నికల్లో తనని గెలిపించాలంటూ ప్రచారం చేశాడు. అలాగే వర్థంతి, జయంతి లకు తేడా తెలియకపోవడం, మంగళగిరి అని స్పష్టం గా పలకలేకపోవడంవంటి అంశాలను ప్రతిపక్షాలు హైలెట్‌ చేశాయి. దీనికి తోడు విషయ పరిజ్ఙానం లేకపోవడంతో ఇలా చాలా సందర్భాల్లో నోరుజారి మీడియాలో హైలెట్ అవడంతో పప్పుగా పేరందుకున్నాడు. చంద్రబాబు కొడుకు కన్నా కోడలిని రాజకీయాల్లోకి తెచ్చి ఉంటే బాగుండేదన్న టాక్‌ ఇప్పటి కూడా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. అందుకు కారణం మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా బ్రహ్మణి చాలా చక్కగా ప్రజలకు అర్థమయ్యేలా మాట్లాడిందని ప్రత్యర్థులు సైతం ఒప్పుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన కొడుకు లోకేష్‌కి రాజకీయపాఠాలు బాగా నేర్పించి స్ట్రాంగ్‌ లీడర్‌ గా సిద్ధం చేయాలని కొందరు సలహా ఇస్తున్నారు. ఈ 5 ఏళ్లల్లో లోకేష్‌ పార్టీ కార్యక్రమాల్లోనూ, వైసీపీ వైఫల్యాలను ఎండగట్టే లీడరైతేనే రానున్న రోజుల్లో చంద్రబాబు వారసుడిగా టిడిపిని నడిపించగలుగుతాడని రాజకీయవిశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.