కెసిఆర్ మాట నిలబెట్టుకోడని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. అయితే ఈ సారి టీఆర్ ఎస్ అధినేత మాట నిలబెట్టుకున్నాడు. ఏపీ సిఎం చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత కెసిఆర్ ప్రకటించారు. దీంతో ఏంటా రిటర్న్ గిఫ్ట్ అన్న ఆసక్తిసామాన్యులతో పాటు రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే తెలంగాణ సిఎం కెసిఆర్ తన గురువు చంద్రబాబుకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ జగన్ గెలుపేనని రాజకీయవర్గాల్లో హాట్ న్యూస్ నడుస్తోంది. బీజేపీతో తెగతెంపులు చేసుకొని కాంగ్రెస్ తో చేతులు కలిపి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేశారు. ఆ సమయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనతో పాటు కెసిఆర్ పై విమర్శలు చేశారు. గెలుపు కాంగ్రెస్‌దే అన్న ధీమాలో కెసిఆర్ ని టార్గెట్ చేస్తూ పలు ఆరోపణలు చేశారు చంద్రబాబు. అయితే ఆ విమర్శలను ప్రజలు పట్టించుకోలేదు. కెసిఆర్ ని భారీ మెజార్టీతో మరోసారి సిఎంగా ఎన్నుకున్నారు. అసలు కాంగ్రెస్ తెలంగాణలో ప్రతిపక్ష హోదా కూడా అందుకోలేకపోవడానికి కారణం చంద్రబాబేనన్న విమర్శలు వినిపించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఆ రోజు కెసిఆర్ తన గురువుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. ఆ బహుమతి చంద్రబాబుని ఓడించడమేనని రాజకీయ విమర్శకులు అంటున్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -