కోహినూర్ వజ్రంలా మెరిసిపోతున్న తెలుగమ్మాయి…

0
51

ఓ తెలుగు అమ్మాయి కోహినూర్ వజ్రంలా మెరిసిపోతోంది. ఆమె అందానికి సినీ జనాలు ఫిదా అయిపోయారు. ఆమె ఎవరోకాద… కోమలి ప్రసాద్. ‘నెపోలియన్’తో తెలుగు తెరకు పరిచయమైన తెలుగమ్మాయి.

అవును… కోమలి ప్రసాద్ తెలుగమ్మాయి. ‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను’ అని ఇండస్ట్రీలో కొందరు చెబుతుంటారు. కోమలి ప్రసాద్ మాత్రం నిజంగానే డాక్టర్. ఆమె డెంటిస్ట్. చదువుతో పాటు నటన అంటే ప్రాణం. చిన్నప్పట్నుంచి పలు స్టేజ్ షోల్లో నటించింది.

తెలుగు తెరపై కథానాయికగా నటించిన తొలి సినిమాతో నటిగా మంచి మార్కులు తెచ్చుకున్న కోమలి ప్రసాద్ ఇప్పుడు మరింత అందంగా ముస్తాబయింది. స్లిమ్‌గా, గ్లామ‌ర్‌గా కనిపిస్తూ… కొత్త ఫొటోషూట్స్‌తో కుర్రాళ్ల మనసు దోచుకుంటోంది.

మరిన్ని అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతో పాటు కమర్షియల్ సినిమాల్లో కథానాయికగా నటించాలని ఉందని ఆమె తెలుపుతోంది.