‘శశికళ’గా అమలా పాల్… జయలలితగా కాజల్

0
58

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా మూడు బయోపిక్ మూవీలు తెరకెక్కుతున్నాయి. వీటిలో ఒకటి ‘శశిలలిత’. జయం మూవీస్‌ బ్యానర్‌పై ఆ సంస్థ అధినేత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

తమిళ ప్రజలు అమ్మగా భావించే ప్రజానేత జయలలిత మృతి వెనుక ఉన్న రహస్యాలు ప్రజల ముందుంచే ప్రయత్నమే ఈ చిత్రం ప్రధాన లక్ష్యం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని నిర్మితం కానుంది.

ఈ చిత్రం గురించిన వివరాలను స్పందిస్తూ, చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావచ్చిందని, త్వరలో ఘాటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జయలలిత పాత్రను కాజోల్‌ దేవగన్‌, శశికళ పాత్రను అమలాపాల్‌ పోషించనున్నారని తెలిపారు. జయలలిత జీవితంలోని మహిషాసురుల నిజస్వరూపాన్ని బట్టబయలు చేసే శక్తి తనకు ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.