ఏపీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బోండా ఉమా కేవలం 15 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాది విష్ణు బోండాపై విజయం సాధించారు. చివరి క్షణం దాకా విజయవాడ సెంట్రల్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు విష్ణు విజయం సాధించినట్లు ప్రకటించారు.
ఇకపోతే, జనసేన పార్టీలో అనూహ్యరీతిలో చివరి నిమిషంలో లోక్సభ టికెట్ అందుకున్న మెగా బ్రదర్ నాగబాబు ఫలితాల్లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. నరసాపురం నుంచి లోక్ సభకు పోటీచేసిన నాగబాబు ఓటమిపాలయ్యారు.
నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు ఘనవిజయం సాధించారు. జగన్ ప్రభంజనానికి నాగబాబు కూడా బలైపోయారు.