సర్దుకుపోతే ఛాన్సిస్తామని… చాయిస్ ఇచ్చారు… అదితి రావు

0
53

ఓ సినిమాలో అవకాశం కోసం ఓ నిర్మాత తనను సంప్రదించాడనీ, ఆయన సర్దుకుపోతే ఛాన్సిస్తామని చెప్పారని నటి అదితి రావు హైదరీ చెప్పుకొచ్చింది. పైగా, తన నిర్ణయం చెప్పేందుకు కొంత సమయం కూడా ఇచ్చారని తెలిపింది. అయితే, అలాంటి అవకాశం తనకు వద్దని నో చెప్పడంతో ఆ అవకాశాన్ని మరో హీరోయిన్‌కు ఇచ్చారని ఆమె వెల్లడించింది.

చెలియా చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమై సమ్మోహనం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను సమ్మోహనపరిచిన హీరోయిన్ అదితిరావు. ఆమె సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అనుభవాలను తాజాగా వెల్లడించింది. తాను కూడా ఓ బాధితురాలినేని చెప్పింది. కాకపోతే, లైంగిక బాధితురాలిని మాత్రం కాదని తెలిపింది.

ఓ సినిమా విషయంలో సర్దుకుపోతే అవకాశం ఇస్తామని లేకపోతే లేదు.. ఛాయిస్ నీదే అని అన్నారన్నారు. నేను దానికి సమ్మతించక పోవడంతో ఆ అవకాశం మరొకరికి ఇచ్చేశారని తెలిపింది. అంతేగానీ, తనను ఎవరూ బలవంతం చేయలేదని చెప్పింది. ఆ తర్వాత తాను 8 నెలల పాటు ఖాళీగా కూర్చొన్నట్టు చెప్పింది. అదేసమయంలో సినీ రంగంలో లైంగిక వేధింపులు ఎక్కువగానే ఉన్నాయనీ, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. లేకపోతే మౌనాన్ని మరోరకంగా అర్థం చేసుకుంటారని అదితి రావు హైదరీ చెప్పుకొచ్చింది.