ఒక్క రోజులో ఎంత మార్పు! బోసిపోయిన చంద్రబాబు నివాసం…

0
44

ఈ నెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో వైకాపా విజయభేరీ మోగించింది. టీడీపీ పూర్తిగా డీలా పడిపోయింది. పార్టీ అధినేత చంద్రబాబుతో సహా మరో 22 మంది మాత్రమే గెలుపొందారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ సైతం మంగళగిరిలో చిత్తుగా ఓడిపోయారు. ఈ ఫలితాల తర్వాత సీన్ పూర్తిగా తలకిందులైంది.

23వ తేదీ ఉదయం 10 గంటల వరకు అమరావతి కరకట్ట రోడ్డులో ఉన్న చంద్రబాబు నివాసం ఎంతో సందడిగా కనిపించింది. ఎన్నికల ట్రెండ్స్‌ అంతకంతకూ వైకాపాకు పెరగడంతో బాబు నివాసం ఉన్న నేతలంతా మెల్లగా జారుకోవడం ప్రారంభించారు. అలా మధ్యాహ్నానికి పూర్తిగా ఒక్కరూ కనిపించకుండా పోయారు.

ఇక రెండో రోజైన 24వ తేదీన చంద్రబాబు నివాసం పూర్తిగా బోసిపోయింది. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఇంటి పని మనుషులు మినహా ఇతరులెవ్వరూ అక్కడ కనిపించలేదు. ముఖ్యంగా పార్టీ నేతలు సైతం చంద్రబాబు ఇంటికి వెళ్లేందుకు ఏమాత్రం సాహసం చేయలేదు.

నిజానికి చంద్రబాబు నివాసం నిత్యం జనసందోహంతో కళకళలాడుతూ ఉంటుంది. కానీ, ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ ఘోర పరాజయం చెందడంతో చంద్రబాబును కలిసేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా రావడంలేదు. ఆ పార్టీ తరపున గెలిచిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అటుగా వచ్చి కనిపించి వెళ్లారు.