జీలకర్రతో రక్తహీనతకు చెక్..

0
54

వంటల్లో జీలకర్రకు చాలా ప్రాధాన్యత ఉంది. జీలకర్ర రుచిలోనే కాదు ఆరోగ్యానికీ చాలా మేలు చేస్తుంది. జీలకర్రలో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, సోడియం, పొటాషియం, విటమిన్‌ ఎ, సి ఎక్కువగా ఉన్నాయి. జీలకర్రను నిత్యం ఆహారంలో తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు క‌లుగుతాయి. అవేంటో తెలుసుకుందాం.

* జీలకర్రలో ఐరన్‌ పుష్కలంగా ఉండడం వలన రక్తంలో హిమోగ్లోబిన్‌ తయారవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో ఐరన్‌ లోపం వల్ల రక్తహీనత తగ్గించుకోవడానికి జీలకర్ర బాగా సహాయపడుతుంది.

* ఒక కప్పు వేడి నీటిలో జీలకర్ర, అల్లం, తేనె, తులసి ఆకులు కలుపుకొని తాగడం వల్ల జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు.

* జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఉండే మలినాలను తొలగించి, ప్రీ రాడికల్స్‌ను నివారించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీలకర్రలో విటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వలన చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తుంది.

* నిత్యం జీలకర్రను తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలను దూరం చేస్తుంది. జీలకర్రను తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్‌ లెవెల్స్ త‌గ్గుతాయి. దీని వలన మధుమేహం నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

* ఫైల్స్‌తో బాధపడే వాళ్లకు జీలకర్ర మంచి ఔషదం. ఇందులో ఎక్కువగా ఫైబర్, యాంటీ ఫంగల్, లాక్సైటీవ్స్, కార్మినేటివ్ గుణాలు ఉన్నాయి. అందువలన మెులల నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతాయి.