మోడీ విజయాన్ని వంటగదిలో సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్

0
44
Manikarnika Actress Kangana Ranaut
Manikarnika Actress Kangana Ranaut

బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఇటీవల్ ఫ్రాన్స్ దేశంలో జరిగిన కేన్స్ ఉత్సవాల్లో పాల్గొని సందడి చేసింది. ఇటీవలే స్వదేశానికి వచ్చిన ఈమె… సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంది.

బీజేపీ విజయానికి పొంగిపోయిన ఆమె, వంటగదిలో దూరి, స్వయంగా పకోడీలు చేసిందట. ఈ విషయాన్ని ఆమె సోదరి రంగోలీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలుపుతూ, కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.

కంగనా ఎంతో అరుదుగా మాత్రమే వంట చేస్తుందని, ఆమె చాలా సంతోషంగా ఉంటేనే గరిట పడుతుందని చెప్పుకొచ్చిన రంగోలీ, రుచికరమైన పకోడీలు చేసి, వాటితో పాటు కాఫీని తమకందించిందని చెప్పింది. ‘జై హింద్‌.. జై భారత్‌’ అన్న క్యాప్షన్ పెట్టి ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.