లోక్‌సభలో పెరిగిన మహిళా ఎంపీల సంఖ్య

0
31

దేశంలో 17వ సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. ఈ కొత్త సభ త్వరలోనే కొలువుదీరనుంది. అయితే, ఈ సభకు అధిక సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 724 మంది మహిళలు పోటీ చేస్తే వారిలో 78 మంది విజయం సాధించారు. ఇందులో 27 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు.

కొత్త సభకు ఎన్నికైన 78 మంది మహిళా ఎంపీల్లో ఉత్తరప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాల నుంచి 11 మంది చొప్పున ఉన్నారు. ముఖ్యంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్ నుంచి 9 మంది, బీజేపీ నుంచి 41 మంది ఉన్నారు

ఊహించ‌ని విధంగా ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఎన్న‌డూ లేని విధంగా 41శాతం మ‌హిళా అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించింది. 1952నుంచి 2014 ఎన్నికల వరకు ఈ స్థాయిలో మహిళలు లోక్‌ సభకు ఎన్నిక కాలేదు. 2009 ఎన్నికల్లో 52 మంది మహిళలు, 2014 ఎన్నికల్లో 64 మంది లోక్‌‌సభకు ఎన్నికయ్యారు.