అనుష్క మనసుపడిన యువ హీరో..

0
61

టాలీవుడ్ లేడీ అమితాబ్‌గా గుర్తింపు పొందిన హీరోయిన్ అనుష్క. ఈమె అందానికి ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులు కావాల్సిందే. ఈమెతో కలిసి నటించాలని ప్రతి ఒక్క హీరో ఆశ పడుతుంటాడు. తాజాగా యువ హీరో నాగశౌర్య కూడా అనుష్కపై మనసుపడ్డాడు.

టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరైన నాగశౌర్య… తన సొంత బ్యానర్‌పై సినిమాలు చేస్తూ విజయాలను అందుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘చిన్నప్పటి నుంచి కూడా నేను చదువు మీద కంటే ఆటలపైనే ఎక్కువగా దృష్టిపెడుతూ వచ్చాను. ఖాళీ సమయం దొరికితే ఇంగ్లిష్ సీరియల్స్ .. సినిమాలు చూస్తుంటాను.

నేను హీరో కాకముందు అనుష్కను ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవాడిని. నేను హీరో అయిన తరువాత కూడా నాకు అనుష్క అంటేనే ఇష్టం. నా సినిమాలో హీరోయిన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం దర్శక నిర్మాతలు నాకు ఇస్తే, అనుష్కను తీసుకోమని చెబుతాను. కాకపోతే నాతో చేయడానికి అనుష్క ఒప్పుకోవాలి గదా’ అంటూ తన మనసులోని మాటను వెల్లడించాడు ఈ కుర్రహీరో.