పూజిత పొన్నాడ అందాలు అదరహో…

0
36

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ చిత్రంలో ఆది పినిశెట్టికి ప్రియురాలిగా నటించిన నటి పూజిత పొన్నాడ. ఈమె తాజాగా హాట్ హాట్ ఫోటోలతో వార్తలకెక్కింది. ప‌లు ర‌కాల డ్రెస్‌ల్లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్ అదిరిపోయింది. ఈ ఫోటోల్లో చాలా గ్లామ‌ర్‌తో మెరిసిపోయింది ఈ భామ‌.

ఈమెకు రంగస్థలం చిత్రం తర్వాత ఎలాంటి సరైన చిత్రాలు రాలేదు. దీంతో అందరి దృష్టిని ఆకర్షిచేందుకు ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంది. ఇందుకోసం ప్రత్యేక ఫోటో షూట్‌లలో పాల్గొంటూ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

పైగా, ఈ అమ్మాయికి వస్తున్న ఒకటి అరా పాత్రలు కూడా పల్లెపడతి పాత్రలే కావడం గమనార్హం. దీంతో తన మోడ్రన్‌ గర్ల్‌గా ఉండేందుకు ఇష్టపడుతున్నట్టు చెప్పేలా ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు.

ఈ ఫోటోలతో అవకాశాల మాట ఎలా ఉన్నా పూజితకి ఫాలోవర్స్‌ అయితే పెరుగుతున్నారు. అచ్చ తెలుగమ్మాయి ఇలా బోల్డ్‌గా కనిపించడం అరుదే కాబట్టి అంత మంది ఎక్స్‌పోజింగ్‌ చేసే నటీమణుల మధ్య కూడా పూజితకి అటెన్షన్‌ దక్కుతోంది.