అవిసె గింజలు పురాతన ఆహార పదార్థ గింజల్లో ఒకటి. వీటిలో అనేక రకాలైన పోషకాలు ఉండటం వల్ల పూర్వకాలంలో ఆహారంగా కూడా వినియోగించేవారు. అలాంటి అవిసె గింజల్లో ఉన్న పోషకాలను గురించి తెలుసుకుందాం.
* అవిసె గింజలు శాఖాహారులకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే పీచు పేగుల్లోని విషపదార్ధాలన్నింటినీ శుభ్రం చేసి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది.
* అవిసె గింజల్లో ఒమేగా 3ఫ్యాటీ ఆమ్లాలూ, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, పీచూ పదార్ధాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ డయాబెటిస్, క్యాన్సర్, ఆస్తమా, ఆర్ద్రటిస్ వంటి వ్యాధుల్నీ అడ్డుకుంటాయి.
* ఈ గింజల్లో ఆస్పార్టిక్, ఆర్జినైన్ అనే ప్రోటిన్లు, రోగనిరోధకశక్తిని పెంచడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌నీ ట్యూమర్లనీ అడ్డుకుంటాయి. వీటిని పిండి రూపంలో వాడితే శరీరానికి పోషకాలు ఎక్కువగా అందుతాయని చెబుతున్నారు.
* ఈ గింజల్లోని ఒమేగా3 ఫాట్యీఆమ్లాలు హృద్రోగాలు రాకుండా చేస్తాయి. లిగ్నిన్లు రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్లనీ అడ్డుకుంటాయి. బీపినీ తగ్గించే సహజ మందు అని చెబుతారు.