ఏదో చేయాలన్న కసితో జగన్ ఉన్నారు : స్వరూపానందేంద్ర సరస్వతి

0
40

ప్రజలకు తన తండ్రి వైఎఎస్ఆర్ చేసినదానికంటే ఇంకా ఏదో చేయాలన్న కసితో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారనీ విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

దీనిపై స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ, వైఎస్ఆర్ తనకు ఎంతో అభిమానమన్నారు. ఆయన కూడా తన పట్ల ఎంతో అభిమానంతో ఉండేవారని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో పేదలకు చేరువయ్యాడని చెప్పారు. పెద్దల నుంచి చిన్నారుల వరకు ఏదో ఒకటి చేయాలన్న తపన ఆయనలో ఉండేదన్నారు.

ఇపుడు ఆ తపన, కసి జగన్ మోహన్ రెడ్డిలో కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా, సమాజంలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్న పరితపించి పోతున్నాడని చెప్పుకొచ్చారు. తన తండ్రికి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందే..అంతకు మించిన స్థాయిలో తాను పేరు సంపాదించుకోవాలని జగన్ ఉవ్విళ్ళూరుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కంటే జగన్ మంచి సుపరిపాలన అందిస్తారని స్వామి అభిప్రాయపడ్డారు.