టాలీవుడ్‌లో జెట్ స్పీడ్ వేగంతో దూసకుపోతున్న కుర్రకారు హీరోయిన్ల జాబితాలో రాశీఖన్నా ఒకరు. ఈమెకు జయాపజయాలతో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తున్నాయి. ఇపుడు టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ – క్రాంతికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రంలో రాశిని ఎంపిక చేశారు.
దీనిపై ఆమె స్పందిస్తూ, రష్మిక తర్వాత విజయ్ దేవరకొండ ముద్దు పెట్టబోయే హీరోయిన్‌ని నేనే అంటూ ఆనందంగా చెప్పింది. విజయ్‌తో కలిసి నటించేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. అతనితో కలిసి లిప్ లాక్ సీన్లు చేయాలని వుంది అంటూ చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి చెప్పొచ్చు ఆమె ఎంత ఆనందంగా, ఆసక్తిగా ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు.
కాగా, “మళ్లీ మళ్లీ ఇది రాని రోజు” వంటి మంచి మెచ్యూర్డ్ లవ్‌స్టోరీని క్రాంతి కుమార్ తెరకెక్కించారు. ఇపుడు విజయ్ దేవరకొండ హీరోగా ఒక చిత్రాన్ని తీస్తున్నాడు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు. అందులో మెయిన్ హీరోయిన్‌గా రాశిఖన్నా నటిస్తోంది. ఆమె చెపుతున్న దాన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమాలోనూ చుంభన సీన్లు అదిరిపోయేలా ఉంటాయన్నమాట.
ఇకపోతే, విజయ్ దేవరకొండ ఎంత టాలెంటెడ్ స్టారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిర్మాత అల్లు అరవింద్ మాటల్లో చెప్పాలంటే ఈ జనరేషన్లో అత్యంత వెర్సటైల్ స్టార్. అందుకే తక్కువ టైమ్‌లోనే ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయగలిగాడు. అయితే, ఈ హీరోకి టాలీవుడ్ ఇమ్రాన్ హస్మీ అనే పేరు కూడా ఉంది. వెండితెరపై ముద్దుల విషయంలో ఒకపుడు సంచలనం సృష్టించిన హస్మీకి పోటీ ఇస్తున్నాడు. అందుకే విజయ్‌తో కలిసి కిస్ సీన్లలో నటించేందుకు హీరోయిన్లు కూడా తహతహలాడుతుండడం ఒక విశేషమే.