దిశా పటానీకి చిక్కనంటున్న బాలీవుడ్ హీరో

0
51

బాలీవుడ్‌లో ఉన్న హాట్ హీరోయిన్లలో దిశా పటానీ ఒకరు. ఈమె బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వీటిపై వీరిద్దరూ ఎన్నడు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు దిశా పటానీ ఆసక్తికర సమాధానం చెప్పింది.

‘గత కొన్నేళ్లుగా టైగర్‌ను ఇంప్రెస్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు ‘భారత్’ సినిమాలో నటించా. అందులో చాలా స్టంట్స్‌, డ్యాన్స్‌ చేశా.. అది చూసైనా అతడు ఇంప్రెస్‌ అవుతాడని ఆశించా. కానీ అవలేదు.. నా దురదృష్టం. మేమిద్దరం తినడానికి కలిసి హోటల్‌కు వెళ్తాం. దానర్థం తనకు నేనంటే ఇష్టమని కాదు. ఈసారి అతడితోనే మాట్లాడండి. అతడికీ సిగ్గే, నాకూ సిగ్గే.. చొరవ తీసుకుని చెప్పలేం’ అని వ్యాఖ్యానించింది.

నిజానికి గత కొన్ని రోజులుగా టైగర్, దిశా ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినవస్తున్నాయి. వీరిద్దరి ప్రేమ విషయంలో మీడియా ప్రశ్నిస్తే తాము మంచి స్నేహితులమని తెలిపారు. అయితే తాజాగా ఓ అభిమాని దిశాను, ‘మీ మధ్య ప్రేమను ఎందుకు ఒప్పుకోరు. మీరు భార్యాభర్తలు కావడం అందరికీ ఇష్టమే’ అని సోషల్ మీడియా వేదికగా అడిగిన ప్రశ్నకు దిశా పటానీ పై విధంగా బదులిచ్చింది.