బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ పెళ్లికి సై అంటోంది. దొంగచాటు రొమాన్స్లు ఎంతకాలం చేయాలని, అదేదో పెళ్లి చేసుకుంటే దాపంత్య జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా అని అంటోంది.
ప్రస్తుతం శ్రద్ధా కపూర్ హీరో ప్రభాస్తో కలిసి సాహో చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది మార్చి లోపు పెళ్లి చేసుకుంటుందంటూ బాలీవుడ్లో రూమర్స్ నడుస్తున్నాయి.
తన చిన్ననాటి స్నేహితుడు, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోషన్ శ్రేష్ఠ్తో శ్రద్ధాకపూర్ కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తోందట. అతడ్నే వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతోందట.
శ్రద్ధాకపూర్పై ఇంతలా పుకార్లు రావడానికి మరో రీజన్ ఉంది. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ నుంచి ఈమె తప్పుకుంది. అప్పట్నుంచి ఈమె పెళ్లిపై ఇలా పుకార్లు వస్తూనే ఉన్నాయి.