చిరంజీవితో చిందేయనున్న శ్రద్ధా శ్రీనాథ్

0
60

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అన్నీ అనుకున్న సమయంలో పూర్తయితే వచ్చే దసరాకు ఈ చిత్రం విడుదలకానుంది. లేదంటే వచ్చే యేడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించే చిత్రం కూడా ఖరారైంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నారు. ఈ చిత్రం కథ డిమాండ్ మేరకు ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఇందులో ఒక హీరోయిన్‌గా నయనతార లేదు అనుష్కలలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. మరొక భామగా శ్రద్ధా శ్రీనాథ్‌ను ఎంపిక చేయాలన్న ఆలోచనలో చిత్ర దర్శకుడు ఉన్నారట.

శ్రద్ధా శ్రీనాథ్ నటించిన జెర్సీ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. పైగా, ఈ చిత్రంలో ఆమె అద్భుతంగా నటించింది. ముఖ్యంగా, హీరో నానితో కలిసి నటించిన రొమాన్స్ సీన్లను పండించింది. అయితే, చిరంజీవితో నటించేందుకు శ్రద్ధా శ్రీనాథ్ సమ్మతిస్తుందా లేదా అన్నది ఇపుడు ప్రశ్న. ఎందుకంటే.. చిరంజీవి వంటి ముదురు హీరోతో నటించడం వల్ల తన కెరీర్‌కు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అనే కోణంలో ఆమె ఆలోచన చేస్తుందట. మ‌రి చిరు సినిమాలో శ్ర‌ద్ధాశ్రీనాథ్ న‌టిస్తుందో లేదు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే