బాలీవుడ్ సుందరాంగి కత్రినా కైఫ్. ఈమెకు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దశ్యం లేనట్టుగా ఉంది. ఒకరు కాదంటే మరొకరితో డేటింగ్ చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వస్తోంది. నిజానికి బాలీవుడ్ నటుడు సల్మాన్‌తో పిచ్చి ప్రేమలో పడిపోయింది. వీరిద్దరూ కొంతకాలం సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. చివరకు సల్మాన్ చిత్రాల్లో కత్రినా హీరోయిన్గా కూడా నటించలేదు. ఇటీవలే ఓ చిత్రంలో నటించింది. దీంతో వీరిమధ్య ప్రేమ చిగురించిందని టాక్ వినిపించింది.
సల్మాన్‌తో కత్రినా ప్రేమాయణం అలా ఉంటే… మరో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌ని ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలనుకొంది. కానీ రణబీర్ కపూర్ ఆమెకి హ్యండిచ్చి ఆలియా భట్‌తో ప్రేమలో పడ్డారు. దీన్నిజీర్ణించుకోలేని కత్రినా.. తాజాగా మరో బాలీవుడ్ హీరో విక్కీ కౌషల్‌కు దగ్గరైంది.
విక్కీ కౌషల్ ఇపుడు బాలీవుడ్లో రైజింగ్ స్టార్. పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. అయితే, హీరోగా నటించిన “యూరి” సర్జికల్ స్ట్రయిక్ సినిమా దాదాపు 250 కోట్ల రూపాయలు కొల్లగొట్టడంతో విక్కీ స్టార్డమ్ అమాంతం పెరిగింది.
దీంతో విక్కీతో వరుసగా సినిమాలు చేసేందుకు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు అమితాసక్తిని చూపుతున్నాయి. ఈ కుర్ర హీరోతో కత్రిన ఈ మధ్య చాలా క్లోజ్‌గా కనిపిస్తోందట. పైగా, కొన్ని సందర్భాల్లో కత్రినా ఇంట్లోనే విక్కీ గడుపుతున్నాడట. దీంతో వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే గుసగుసలు బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి.