సల్మాన్ పెద్ద పోటుగాడా.. మొగుళ్లను వదిలేసి రావడానికి?

0
42

కొంతమంది మహిళలను తమ భర్తలను కూడా వదిలివేసి తన కోసం పరుగెత్తుకుంటూ వస్తారంటూ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై పలువురు బాలీవుడ్ నటీమణులు ఘాటుగానే స్పందించారు. సల్మాన్‌కు అంత సీన్ లేదు. తమ మొగుళ్ళను వదిలివేసి ఆయన కోసం పరుగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి లేదనే విషయాన్ని ఈ కండల వీరుడు గ్రహిస్తే మంచిదంటూ చెంపెఛెళ్లుమనేలా సమాధానమిచ్చారు.

బాలీవుడ్ ముదురు బ్యాచిలర్ హీరో సల్మాన్ ఖాన్. “ప్రేమ పావురాలు” (మైనే ప్యార్ కియా) స‌మ‌యంలో ఎంత అందంగా ఉన్నాడో ఐదు పదుల వయసులోనూ అంతే అందంగా ఉన్నాడు. దీంతో సల్మాన్ ఖాన్‌కు లేడీస్ పాలోయింగ్ అధికం. మాస్‌లో స‌ల్మాన్‌ని మించిన వారు లేరన్నది వాస్తవం కూడా.

ఈ నేపథ్యంలో స‌ల్మాన్‌ఖాన్ ఇటీవ‌ల చేసిన కామెంట్ బాగా ట్రోలింగ్‌ అయ్యాయి. ‘నా కోసం మొగ‌ళ్ల‌ని కూడా వ‌దిలేసి వ‌స్తారు కొంద‌రు భార్య‌లు’ అంటూ మాట్లాడి వివాదంలో చిక్కుకున్నాడు. ఆయ‌న న‌టించిన “భ‌ర‌త్” సినిమా విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ సంద‌ర్భంగా ఈ కామెంట్ చేసి ట్రోలింగ్‌కి గుర‌వుతున్నాడు.

నిజానికి ఈ చిత్రంలో తొలుత ప్రియాంక‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే, నిక్ జోనాస్‌తో పెళ్లి కుద‌ర‌డంతో సినిమాని వ‌దిలేసి పెళ్లి ప‌నుల‌తో బిజీగా ఉండిపోయింది. ఆమె స్థానంలో క‌త్రినని తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ, ప్రియాంక‌కి నా సినిమా క‌న్నా ఆమెకి పెళ్లి ముఖ్య‌మయింది. వేరే అమ్మాయిలకి నా సినిమాలో ఛాన్స్ వ‌స్తే క‌ట్టుకున్న వాడిని కూడా వ‌దిలేసి వ‌స్తారు అంటూ మాట్లాడాడు.

దీనిపై మ‌హిళ‌సంఘాలు మండిప‌డుతున్నాయి. స‌ల్మాన్‌ఖాన్ మేల్ ఛావ‌నిస్ట్ (పురుషాధిక్య భావాజలం ఉన్న వ్య‌క్తి) అంటూ, ప‌క్కా క్లాస్‌లెస్ గై అంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రోవైపు, సోష‌ల్ మీడియాలోనూ జ‌నం ఓ రేంజ్‌లో స‌ల్మాన్‌ని ఆడుకుంటున్నారు. 53 ఏళ్ల ఈ బ్ర‌హ్మ‌చారి త‌న‌కి ఏజ్‌బార్ అయింద‌న్న విష‌యం గుర్తించ‌డం లేదు అంటూ కామెంట్లు ప‌డుతున్నాయి.