కరపత్రాలు పంచేందుకు కూడా కేడర్ లేని పార్టీకి అన్ని సీట్లా?

0
50

సార్వత్రిక ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై టీడీపీ నేతలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏదో జరిగిందనీ అందుకే ఇలాంటి అవమానకర ఫలితాలు వచ్చాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యనపాత్రుడు అభిప్రాయపడ్డారు.

ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన అహర్నిశలు రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉన్నారు. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా ఆయన ఆదాయ వనరులు సృష్టిస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించారు.

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరికీ మేలు చేసేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని సమర్థవంతంగా అమలు చేశారని గుర్తుచేశారు. కానీ, ఈ ఫలితాలు ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేశాయన్నారు.

అదేసమయంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాలుగు స్థానాల్లో గెలవడం ఏంటి? అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఏదో జరిగిందని అందుకే ఈ తరహా అవమానకర ఫలితాలను చవిచూడాల్సి చ్చిందని మంత్రి అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా, బీజేపీకి కరపత్రాలు పంచేందుకు కూడా కార్యకర్తలు లేరని, అటువంటి చోట్ల బీజేపీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. బీజేపీపై దేశవ్యాప్తంగా ఇంత వ్యతిరేకత ఉంటే ఆ పార్టీకి 300కు పైగా సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. చూస్తుంటే అనుమానంగా ఉందని అయ్యన్నపాత్రుడు అన్నారు.