అక్కినేని ఇంటి కోడలు సమంత. ఈమె సినీ కెరీర్ పెళ్లికి ముందు ఎలా ఉన్నదోగానీ, యువ హీరో నాగ చైతన్యను పెళ్లాడిన తర్వాత మాత్రం సమంత సినీ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. పెళ్లి తర్వాత ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ హిట్స్ సాధించాయి.
ముఖ్యంగా తన భర్త నాగ చైతన్యతో కలిసి తాజాగా నటించిన చిత్రం “మజిలీ”. ఈ చిత్రం బంపర్ హిట్. నాగ చైతన్య ఖాతాలో తొలి బంపర్ విజయం. గతంలో కూడా “ఏ మాయ చేశావే” చిత్రం కూడా ఇదే విధంగా బ్లాక్‌బస్టర్. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం ఎపుడెపుడా అంటూ సినీ జనాలు ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘మజిలీ’ దర్శక నిర్మాతలే సమంత – చైతులతో కలిసి ఓ చిత్రాన్ని ప్లాన్ చేశారట. అయితే, వారికి సమంత ఓ కండిషన్ పెట్టిందట. ఇప్పటివరకు తమ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగు సినిమాలకి భిన్నమైన, కొత్త కథ, కథనాలతో కూడిన స్క్రిప్ట్‌ని తీసుకొస్తేనే ఆ చిత్రంలో నటించేందుకు సమ్మతిస్తామని కరాఖండిగా తేల్చిచెప్పిందట.
కాగా, గతంలో చైసామ్‌లు “ఏ మాయ చేశావె”, “ఆటోనగర్ సూర్య”, “మనం”, “మజిలీ” వంటి చిత్రాల్లో నటించారు. వీటిలో ఆటో నగర్ సూర్య మాత్రమే ప్రేక్షకుల అంచనాలను అందుకోలే పోయింది. మిగిలిన చిత్రాలన్నీ సూపర్ డూపర్ హిట్స్ కొట్టాయి.